ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ పూర్తి గైడ్ – చట్టం, క్లెయిమ్ విధానం, నోటీసులు, అప్పీల్ ప్రక్రియ

డాటెడ్ ల్యాండ్స్ పూర్తి గైడ్ (Andhra Pradesh Dotted Lands Act, 2017)

ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్య డాటెడ్ ల్యాండ్స్ (Dotted Lands). చాలా సంవత్సరాలుగా ఈ భూములు రిజిస్ట్రేషన్‌కు అనుమతి లేకుండా ప్రొహిబిటరీ ప్రాపర్టీ లిస్ట్ (Section 22-A, Registration Act 1908) లో ఉండటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం “The Andhra Pradesh Dotted Lands (Updation in Re-Settlement Register) Act, 2017 (Act No.10 of 2017)” ను అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం డాటెడ్ ల్యాండ్స్‌పై క్లెయిమ్స్ పరిశీలించి నిజమైన యాజమాన్యాన్ని నిర్ధారించి Re-Settlement Register (RSR) మరియు ఇతర రెవెన్యూ రికార్డులను అప్‌డేట్ చేయడం ప్రధాన ఉద్దేశ్యం.

ఈ ఆర్టికల్‌లో డాటెడ్ ల్యాండ్స్ గురించి చట్టపరమైన నిర్వచనం, క్లెయిమ్ విధానం, విచారణ ప్రక్రియ, నోటీసులు, అప్పీల్ విధానం వంటి అంశాలను చట్టం మరియు రూల్స్ ప్రకారం వివరంగా చూడవచ్చు.

చట్టం అమల్లోకి వచ్చిన తేదీ

ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ (Updation in Re-Settlement Register) Act, 2017 ను రాష్ట్ర శాసనసభ ఆమోదించి01-05-2017న Andhra Pradesh Gazette లో ప్రచురించారు.

తదుపరి ప్రభుత్వంG.O.Ms.No.210, Revenue (Assgn.I) Department, dated 14-06-2017 ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి14 జూన్ 2017 నుండి ఈ చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఈ నోటిఫికేషన్Section 1(3) of the Andhra Pradesh Dotted Lands Act, 2017 ప్రకారం జారీ చేయబడింది.

డాటెడ్ ల్యాండ్స్ అంటే ఏమిటి?

డాటెడ్ ల్యాండ్స్ అనగా రీసర్వే మరియు సెటిల్‌మెంట్ సమయంలో తయారు చేసిన Re-Settlement Register (RSR) లో పట్టాదారు కాలమ్ నంబర్ 16 లో డాట్ (…..) గుర్తు పెట్టిన భూములు. ఈ గుర్తు వల్ల ఆ భూముల యాజమాన్యం స్పష్టంగా నమోదు కాలేదు. ఈ రికార్డులు ప్రధానంగా 1916 ప్రాంతంలో జరిగిన Resurvey and Settlement Operations సమయంలో తయారయ్యాయి. అందువల్ల కొన్ని భూములపై యాజమాన్యం నిర్ధారణ కాకపోవడం వల్ల తరువాత అవి ప్రొహిబిటరీ ప్రాపర్టీ లిస్ట్‌లో చేర్చబడ్డాయి.

Re-Settlement Register (RSR) అంటే ఏమిటి?

RSR అనేది రీసర్వే మరియు సెటిల్‌మెంట్ పూర్తయ్యాక తయారు చేసే ప్రధాన భూ రికార్డు. దీనిని A-Register లేదా Diglot అని కూడా అంటారు. ఈ రికార్డులో:

  • సర్వే నంబర్
  • భూమి విస్తీర్ణం
  • భూమి స్వభావం
  • పట్టాదారు పేరు

వంటి వివరాలు నమోదు చేయబడతాయి.

డాక్యుమెంట్స్ అంటే ఏమిటి?

డాటెడ్ ల్యాండ్స్ చట్టం ప్రకారం కింది రికార్డులను డాక్యుమెంట్స్ గా పరిగణిస్తారు:

  • రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ (Sale Deeds etc.)
  • Registration Department లోని Register of Holdings(RH)
  • 10(1) Account
  • Revenue Department నిర్వహించే Record of Rights (ROR)
  • కోర్టు లేదా అధికారుల ఉత్తర్వులు / డిక్రీలు
  •  

డాటెడ్ ల్యాండ్స్ క్లెయిమ్ విధానం (As per Act & Rules)

డాటెడ్ ల్యాండ్స్ పై క్లెయిమ్‌లు Section 4 of the Act ప్రకారం మూడు విధాలుగా ఉంటాయి. క్లెయిమ్‌లు District Level Committee (DLSC) ముందు వేయాలి.

1. Section 4(1) – ప్రభుత్వ భూమిగా క్లెయిమ్ (Form-I)

ఈ సందర్భంలో తహసీల్దార్ ప్రభుత్వ తరఫున క్లెయిమ్ వేస్తారు.

కింది పరిస్థితుల్లో ఈ క్లెయిమ్ వేస్తారు:

  • RSR లో డాట్ గుర్తు ఉన్న భూమి
  • భూమి ఖాళీగా ఉండటం
  • ఎవరికీ అసైన్ చేయకపోవడం
  • ఎవరూ క్లెయిమ్ చేయకపోవడం

ఈ క్లెయిమ్ Form-I లో జిల్లా కలెక్టర్ మరియు District Level Committee Chairperson కు పంపబడుతుంది. ఈ సందర్భంలో ఆ భూమిని Government Poramboke గా నమోదు చేయాలని సూచిస్తారు.

2. Section 4(2) – ప్రభుత్వం అసైన్ / ఎలియనేట్ చేసిన భూములు (Form-II)

కొన్ని డాటెడ్ ల్యాండ్స్:

  • ప్రభుత్వం అసైన్ చేసినవి
  • ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసినవి
  • లేదా ఎలియనేట్ చేసినవి

అలాంటి సందర్భాల్లో తహసీల్దార్ Form-II ద్వారా క్లెయిమ్ వేస్తారు.

ఈ ఫారంలో కింది వివరాలు ఉంటాయి:

  • గ్రామం పేరు
  • సర్వే నంబర్
  • విస్తీర్ణం
  • అసైన్ చేసిన వ్యక్తి పేరు
  • GO లేదా Collector Proceedings వివరాలు

ఈ సందర్భంలో RSR లో సంబంధిత వ్యక్తి లేదా శాఖ పేరు నమోదు చేస్తారు.

3. Section 4(3) – వ్యక్తుల క్లెయిమ్ (Form-III)

డాటెడ్ ల్యాండ్స్‌లో కొన్ని భూములు వ్యక్తుల స్వాధీనం మరియు సాగులో ఉండవచ్చు. అలాంటి వారు Form-III ద్వారా క్లెయిమ్ వేయవచ్చు.

క్లెయిమ్ దాఖలు చేసే వ్యక్తి కింది డాక్యుమెంట్స్ సమర్పించాలి:

  • Registered documents (Sale deeds etc.)
  • Registration Department లోని Register of Holdings(RH)
  • Encumbrance Certificate (EC)
  • 10(1) Account
  • Record of Rights
  • కోర్టు తీర్పులు లేదా ఉత్తర్వులు

ఈ క్లెయిమ్ ద్వారా RSR లో వారి పేరు నమోదు చేయాలని కోరవచ్చు.

ఫైల్ ప్రవాహం (File Process)

డాటెడ్ ల్యాండ్స్ క్లెయిమ్ వచ్చిన తర్వాత ఫైల్ సాధారణంగా ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది:

Claim → Tahsildar enquiry → RDO (Revenue Divisional Officer) → District Level Committee (DLSC)

తహసీల్దార్ విచారణ పూర్తి చేసి నివేదిక తయారు చేసి RDO ద్వారా District Level Committee కి పంపబడుతుంది.

విచారణ ప్రక్రియ (Procedure for Enquiry)

డాటెడ్ ల్యాండ్స్ క్లెయిమ్ వచ్చిన తర్వాత Rule 4 of the Rules, 2017 ప్రకారం విచారణ జరుగుతుంది.

1. నోటీసులు జారీ

తహసీల్దార్ లేదా DLSC కన్వీనర్ కింది కార్యాలయాల్లో నోటీసులు ప్రదర్శిస్తారు:

  • Tahsildar Office
  • Gram Panchayat Office
  • Village Revenue Officer Office
  • Primary Agricultural Co-operative Society
  • Registrar office/sub-registrar office
  • Mandal Parishad Development office
  • Grama Sachivalayam/Ward Sachivalayam
  • గ్రామంలోని ముఖ్య ప్రదేశాలు

అదనంగా beat of tom-tom ద్వారా గ్రామంలో ప్రచారం చేయాలి.

జారీ చేసే నోటీసుల రకాలు

డాటెడ్ ల్యాండ్స్ రూల్స్ ప్రకారం మొత్తం 5 రకాల నోటీసులు ఉంటాయి.

Notice-1 (Form-V)

Section 4(1) క్లెయిమ్‌లకు సంబంధించిన నోటీసు.

ఈ నోటీసులో:

  • భూమి ఖాళీగా ఉందని
  • Government Poramboke గా నమోదు చేయాలని

తెలియజేస్తారు.

అభ్యంతరాలు ఇవ్వడానికి గడువు: 30 రోజులు

Notice-2 (Form-VI)

Section 4(2) క్లెయిమ్‌లకు సంబంధించిన నోటీసు.

ఈ నోటీసులో:

  • భూమి ప్రభుత్వం అసైన్ / ఎలియనేట్ / ట్రాన్స్‌ఫర్ చేసిన వివరాలు

ప్రచురిస్తారు.

అభ్యంతరాల గడువు: 30 రోజులు

Notice-3 (Form-VII)

Section 4(3) వ్యక్తుల క్లెయిమ్‌లకు సంబంధించిన నోటీసు.

ఈ నోటీసులో:

  • క్లెయిమ్ చేసిన వ్యక్తి పేరు
  • సర్వే నంబర్
  • విస్తీర్ణం
  • భూమి పొందిన విధానం

తెలియజేస్తారు.

అభ్యంతరాల గడువు: 30 రోజులు

Notice-4 (Form-VIII)

ఈ నోటీసు విచారణ తేదీ ప్రకటించడానికి ఉపయోగిస్తారు.

ఇందులో:

  • విచారణ తేదీ
  • స్థలం
  • హాజరు కావాల్సిన వ్యక్తులు

తెలియజేస్తారు.

నోటీసు పీరియడ్: కనీసం 7 స్పష్టమైన పని దినాలు

Notice-5 (Form-IX)

District Level Committee నిర్ణయంపై CCLA వద్ద అప్పీల్ వచ్చినప్పుడు ఈ నోటీసు జారీ చేస్తారు.

ఇది అప్పీల్ విచారణకు సంబంధించిన నోటీసు.

అభ్యంతరాల రిజిస్టర్

తహసీల్దార్ ప్రతి క్లెయిమ్‌కు వచ్చిన అభ్యంతరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

రిజిస్టర్‌లో నమోదు చేసే వివరాలు:

  • క్లెయిమ్ నంబర్
  • క్లెయిమెంట్ పేరు
  • గ్రామం
  • సర్వే నంబర్
  • విస్తీర్ణం
  • అభ్యంతరం తెలిపిన వ్యక్తి పేరు
  • అభ్యంతరం సారాంశం
  • అభ్యంతరం వచ్చిన తేదీ

విచారణ సమయంలో అధికారుల అధికారాలు

విచారణ సమయంలో తహసీల్దార్‌కు కింది అధికారాలు ఉంటాయి:

  • సంబంధిత వ్యక్తులను పిలిపించడం
  • అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలని ఆదేశించడం
  • భూమిని పరిశీలించడం మరియు కొలిచించడం

జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం

తహసీల్దార్ నివేదికను పరిశీలించిన తర్వాత District Level Committee కింది అంశాలను పరిశీలిస్తుంది:

  • క్లెయిమ్
  • అభ్యంతరాలు
  • రికార్డులు
  • ఆధారాలు

తరువాత Section 7 of the Act ప్రకారం Speaking Order జారీ చేస్తుంది.

ఈ నిర్ణయం క్లెయిమ్ ఫైల్ అయిన తేదీ నుండి 6 నెలల్లోపు ఇవ్వాలి.

అప్పీల్ విధానం

District Level Committee నిర్ణయంపై అసంతృప్తి ఉంటే:

  • Section 8 of the Act ప్రకారం అప్పీల్ చేయవచ్చు
  • అప్పీల్ Chief Commissioner of Land Administration (CCLA) వద్ద వేయాలి

అప్పీల్ గడువు: 90 రోజులు

CCLA రికార్డులు పరిశీలించి అప్పీల్‌పై నిర్ణయం తీసుకుంటారు.

రికార్డుల అప్‌డేషన్

District Level Committee లేదా CCLA ఆర్డర్ వచ్చిన తర్వాత:

Section 9 ప్రకారం Tahsildar కింది రికార్డులను అప్‌డేట్ చేయాలి

  • Re-Settlement Register
  • ఇతర రెవెన్యూ రికార్డులు
  • డిజిటల్ రికార్డులు

ఈ ప్రక్రియ 1 నెలలోపు పూర్తి చేయాలి.

22-A ప్రొహిబిటరీ లిస్ట్ నుండి తొలగింపు

ఆర్డర్ వచ్చిన తర్వాత:

  1. District Collector ఆ భూముల జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతారు
  2. Registering Officer ఆ భూములను Section 22-A ప్రొహిబిటరీ లిస్ట్ నుండి తొలగిస్తారు

దీంతో భూమి రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుంది.

ఈ G.O.Ms.No.575 అసలు ఏమి చెబుతుంది?

ఈ GO లో ప్రభుత్వం ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేసింది.

1. 18-06-1954 కు ముందు Assigned Lands

  • 1954కి ముందు ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్‌లలోNon-alienation condition (అమ్మకానికి నిషేధం) ఉండేది కాదు.

2. 18-06-1954 తరువాత

G.O.Ms.No.1142, Revenue Department, dated 18-06-1954 ద్వారా ప్రభుత్వం ఈ నిబంధన పెట్టింది:

  • Assigned land heritable but not alienable
  • అంటే వారసత్వంగా రావచ్చు కానీ అమ్మకానికి అనుమతి లేదు.

3. Assigned Lands Act 1977 నిర్వచనం

A.P. Assigned Lands (Prohibition of Transfers) Act, 1977 ప్రకారం:

Assigned land అంటే:

  • ప్రభుత్వం landless poor కు ఇచ్చిన భూమి
  • non-alienation condition తో ఇచ్చిన భూమి

అంటే 1954కి ముందు ఇచ్చిన భూములు ఈ నిర్వచనంలోకి రావు.

4. అందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం

ప్రభుత్వం ఇలా నిర్ణయించింది:

  • 18-06-1954 కి ముందు అసైన్ చేసిన భూములను Section 22-A (Registration Act, 1908) నుండి తొలగించాలి.

దీంతో:

  • ఆ భూములు prohibitory list నుండి తొలగించబడతాయి
  • రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది.

డాటెడ్ ల్యాండ్స్ సమస్య చాలా కాలంగా రైతులను ఇబ్బంది పెట్టింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం 2017లో ప్రత్యేక చట్టం మరియు రూల్స్ తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం క్లెయిమ్స్ పరిశీలించి నిజమైన యాజమాన్యాన్ని నిర్ధారించి RSR మరియు ఇతర రెవెన్యూ రికార్డులను అప్‌డేట్ చేస్తారు. తద్వారా భూములను Section 22-A ప్రొహిబిటరీ లిస్ట్ నుండి తొలగించి రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు.

Step by Step Work Flow

Sl.NoStage / StepAuthorityForm / NoticeTime PeriodDescription
1Application / Claim Filed with required documentsClaimant (Individual)Form-IIIవ్యక్తి తన స్వాధీనంలో ఉన్న డాటెడ్ ల్యాండ్ పై క్లెయిమ్ దాఖలు చేస్తారు.
2Application submittedDistrict Collector / District Level Committee (DLSC)Form-IIIక్లెయిమ్ జిల్లా కలెక్టర్ మరియు DLSC కి సమర్పించబడుతుంది.
3Claim received & enquiry initiatedTahsildarతహసీల్దార్ క్లెయిమ్ నమోదు చేసి విచారణ ప్రారంభిస్తారు.
4Public Notice issuedTahsildar / ConvenorForm-VII (Notice-3)30 Daysగ్రామంలో పబ్లిక్ నోటీసు జారీ చేసి అభ్యంతరాలు ఇవ్వడానికి 30 రోజులు గడువు ఇస్తారు.
5Objections receivedTahsildarWithin 30 daysఆసక్తి ఉన్న వ్యక్తులు వ్రాతపూర్వక అభ్యంతరాలు సమర్పించవచ్చు.
6Enquiry Notice issuedTahsildarForm-VIII (Notice-4)Minimum 7 clear working daysవిచారణ తేదీ ప్రకటిస్తూ నోటీసు జారీ చేస్తారు.
7Village Enquiry conductedTahsildarగ్రామంలో విచారణ నిర్వహించి క్లెయిమెంట్, అభ్యంతరదారుల వాదనలు వింటారు మరియు రికార్డులు పరిశీలిస్తారు.
8Enquiry Report preparedTahsildarతహసీల్దార్ విచారణ నివేదిక తయారు చేస్తారు.
9File forwardedThrough RDOతహసీల్దార్ నివేదిక RDO ద్వారా District Level Committee కి పంపబడుతుంది.
10Decision / Speaking OrderDistrict Level Committee (DLSC)Order u/s 7Within 6 monthsక్లెయిమ్, రికార్డులు, అభ్యంతరాలు పరిశీలించి స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు.
11Appeal (if not satisfied)Chief Commissioner of Land Administration (CCLA)Form-IV
Form-IX
Within 90 daysDLSC నిర్ణయంపై అసంతృప్తి ఉంటే అప్పీల్ చేయవచ్చు.
12Final OrderCCLAOrder u/s 8అప్పీల్ విచారణ అనంతరం తుది స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు.

References

  1. The Andhra Pradesh Dotted Lands (Updation in Re-Settlement Register) Act, 2017
  2. G.O.Ms.No.210, Revenue (Assgn.I) Department, dated 14-06-2017
  3. G.O.Ms.No.298, Revenue (Assgn.I) Department, dated 17-07-2017
  4. G.O.Ms.No.575, Revenue (Assignment-I) Department, dated 16-11-2018

Leave a Comment