ఎన్నికల వ్యవస్థలో మార్పులు: ECI తీసుకొచ్చిన 30 కీలక సంస్కరణలు

గత 6 నెలల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన 30 సంస్కరణలు

ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసే రోజు మాత్రమే కాదు… అది విశ్వాసంపై నిలిచే వ్యవస్థ. ఆ విశ్వాసాన్ని కాపాడటానికి ఎన్నికల కమిషన్ గత 6 నెలల్లో 30కు పైగా కీలక సంస్కరణలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల పెంపు నుంచి 100% వెబ్‌కాస్టింగ్ వరకు, డూప్లికేట్ EPIC సమస్య పరిష్కారం నుంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో స్పష్టత వరకు, ప్రతి చర్య ఓటరిపై నమ్మకంతో తీసుకున్న అడుగే.

మన ఓటు సురక్షితంగా నమోదు కావాలి, లెక్కింపులో పారదర్శకత ఉండాలి, ఫలితాల ప్రకటనలో స్పష్టత ఉండాలి. ఈ లక్ష్యంతో ఎన్నికల కమిషన్ కష్టపడుతోంది. ఈ మార్పులు కేవలం పరిపాలనా నిర్ణయాలు కావు; ఇవి ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం వేసిన బలమైన పునాది రాళ్లు.

ఈ ఆర్టికల్ లో ఆ 30 సంస్కరణలు ఏమిటి? అవి పాత విధానాల కంటే ఎలా మెరుగయ్యాయి? ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి? అనేది సులభంగా తెలుసుకుందాం.

పాత పరిస్థితి – కొత్త మార్పులు

ఈ మార్పులు ముఖ్యంగా:

  • ఓటర్ల జాబితా (Electoral Roll)
  • పోలింగ్ రోజు ఏర్పాట్లు
  • ఓట్ల లెక్కింపు విధానం
  • శిక్షణ & పరిపాలన
  • సాంకేతిక సంస్కరణలు

క్రింద పట్టికల్లో పాత పరిస్థితి మరియు తాజా మార్పులను చూడండి.

A. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌకర్యాలు

క్ర.సంఖ్యఅంశంపాత పరిస్థితితాజా మార్పు
1మొబైల్ డిపాజిట్ సౌకర్యంమొబైల్ తీసుకెళ్లడంపై గందరగోళంపోలింగ్ కేంద్రం బయట మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు
2స్పష్టమైన ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్వివరాలు స్పష్టంగా కనిపించకపోవడంసీరియల్ & పార్ట్ నంబర్లు పెద్ద అక్షరాల్లో
3ఒక్క పోలింగ్ కేంద్రానికి ఓటర్లుఅధిక జనసందోహంగరిష్టంగా 1,200 ఓటర్ల పరిమితి
4ఓటింగ్ శాతం సమాచారంఆలస్యంగా సమాచారంప్రతి 2 గంటలకు ECINET యాప్ ద్వారా అప్డేట్
5వెబ్‌కాస్టింగ్పరిమిత పర్యవేక్షణ100% వెబ్‌కాస్టింగ్ అమలు
6అభ్యర్థుల సహాయ బూత్‌లుఅభ్యర్థుల సహాయ బూత్‌ పై స్పష్టత లేకపోవడంపోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దాటి అభ్యర్థుల సహాయ బూత్‌లు ఏర్పాటు కు  అనుమతి

B. సాంకేతిక మార్పులు

క్ర.సంఖ్యఅంశంపాత విధానంకొత్త విధానం
7ECINET ప్లాట్‌ఫాం40కి పైగా యాప్‌లుఒకే డిజిటల్ పోర్టల్
8ఇండెక్స్ కార్డ్ విడుదలనెలల పాటు ఆలస్యంఫలితాల తర్వాత 72 గంటల్లో విడుదల
9EPIC కార్డు పంపిణీఆలస్యం15 రోజుల్లో SMS సమాచారం తో పంపిణీ
10డూప్లికేట్ EPICఒకే EPIC నంబర్ ఇద్దరికిసమస్య పూర్తిగా పరిష్కారం
11మరణించిన వారి డేటామాన్యువల్ తొలగింపుఆటోమేటిక్ డేటా సమీకరణ
12EVM బ్యాలెట్ పేపర్ఫోటోలు లేకపోవడంకలర్ ఫోటోలు & స్పష్టత పెంపు
13EVM తనిఖీలుపరిమిత పరిశీలన5% యంత్రాల సాంకేతిక తనిఖీ

C. ఓట్ల లెక్కింపు మార్పులు

క్ర.సంఖ్యఅంశంపాత పరిస్థితికొత్త మార్పు
14VVPAT తనిఖీపరిమితంగాmismatch ఉంటే తప్పనిసరి లెక్కింపు
15పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుEVM తరువాత  లెక్కింపుముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చివరిలో EVM లెక్కింపు
16రియల్ టైమ్ పర్యవేక్షణమాన్యువల్ సమన్వయంECINET ద్వార డిజిటల్ పర్యవేక్షణ

D. ఓటర్ల జాబితా సంస్కరణలు

క్ర.సంఖ్యఅంశంపాత విధానంకొత్త విధానం
17Special Intensive Revision ప్రత్యేక సవరణసాధారణ సవరణIntensive Purufication ప్రత్యేక సవరణ కార్యక్రమం
18ఉప ఎన్నికల ముందు SSRఅమలు కాలేదు20 సంవత్సరాల తర్వాత అమలు
19BLA శిక్షణపరిమితంగాచట్టపరమైన శిక్షణ (as per RP Act 1950 Provisions )
20BLO శిక్షణసాధారణ అవగాహన7,000 మందికి పైగా IIIDEM, New Delhi లో  శిక్షణ

E. పరిపాలనా మార్పులు

క్ర.సంఖ్యఅంశంపాత పరిస్థితితాజా మార్పు
21పోలీస్ శిక్షణసాధారణ సమన్వయంప్రత్యేక ఎన్నికల శిక్షణ
22సిబ్బంది భత్యాలుసాధారణ చెల్లింపులుభత్యాలు పెంపు
23అన్ని పార్టీల సమావేశాలుపరిమితంగాదేశవ్యాప్తంగా 4,719 సమావేశాలు
24పార్టీ నాయకులతో భేటీలుఅరుదుగా25 ప్రధాన సమావేశాలు
25RUPP (Registered Unrecognised Political Parties) పార్టీల తొలగింపుఅనేక నిర్వీర్య పార్టీలు కొనసాగింపు808 పార్టీలు తొలగింపు
26చట్టపరమైన మార్పులుసాధారణ సమీక్షజాతీయ స్థాయి సమావేశం

F. వ్యవస్థాగత మార్పులు

క్ర.సంఖ్యఅంశంపాత పరిస్థితితాజా మార్పు
27బాధ్యతల మ్యాపింగ్స్పష్టత లోపం28 భాగస్వాముల స్పష్టమైన పాత్రలు
28కార్యాలయ డిజిటలైజేషన్మాన్యువల్ పనిబయోమెట్రిక్ & e-Office
29కమ్యూనికేషన్ అధికారులకు శిక్షణపరిమిత శిక్షణ36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల CEO కార్యాలయం లో మీడియా & కమ్యూనికేషన్ అధికారులకు ప్రత్యేక  శిక్షణ
30అంతర్జాతీయ సహకారంపరిమిత సంబంధాలుద్వైపాక్షిక సమావేశాలు

ఈ మార్పుల ప్రభావం ఏమిటి?

✔ ఓటర్లకు మెరుగైన సౌకర్యం
✔ వేగవంతమైన సేవలు
✔ పారదర్శకమైన లెక్కింపు
✔ శుభ్రమైన ఓటర్ల జాబితా
✔ సాంకేతిక ఆధారిత ఎన్నికల నిర్వహణ

ఎన్నికల కమిషన్ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. మన ఓటు ఎక్కడా కోల్పోకూడదని, ఎవరూ దానిని ప్రభావితం చేయకూడదని, ప్రతి ఓటు సక్రమంగా లెక్కించబడాలని కృషి చేస్తోంది.

కాని ప్రజాస్వామ్యం కేవలం వ్యవస్థలతో బలపడదు…
అది మన మనస్సాక్షితో బలపడుతుంది.

ఓటు వేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించాలి
నేను వేసే ఓటు నా పిల్లల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది?
నా గ్రామం, నా రాష్ట్రం, నా దేశం కోసం నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా?

డబ్బు కోసం కాదు… భయం కోసం కాదు…
నిజాయితీ కోసం, అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలి.

ఎన్నికల కమిషన్ వ్యవస్థను మార్చుతోంది.
ఇప్పుడు మనం మన ఆలోచనను మార్చాలి.

మన ఓటు పవిత్రం. దానిని నిజాయితీతో ఉపయోగించినప్పుడే ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది.

Leave a Comment